పోలవరంపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుామరుకు మాజీ మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. దేవినేని ఉమ మాట్లాడుతూ… పోలవరం 2021 డిసెంబరుకు పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ ప్రకటన ఏమయ్యింది అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో, మీడియాలో జరిగే చర్చకు మంత్రి అనిల్ ఏమి సమాధానం ఇస్తారు అన్నారు. ప్రతిపక్షాలను తిట్టి పోలవరం నుంచి తప్పించుకోలేరు. పోలవరం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ. 4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అని అడిగారు. 30 నెలల్లో పోలవరం నిర్మాణ పనులకు ఎంత ఖర్చు అయ్యిందో చెప్పాలి కానీ.. బూతులు మాట్లాడొద్దు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో పునరావాసానికి ఎంత ఖర్చు పెట్టారు.. 2020 జూన్ నెల నాటికి 20 వేల మందికి ఇళ్లు కడతామన్నారు.. అదేమైంది.. ఈ బూతుల మంత్రులు మనకు మంత్రులా అని ప్రజలను అడిగారు ఈ మాజీ మంత్రి.