టీడీపీ కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. “లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు, పప్పు లోకేష్ అందుకే అనేది. దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాము. మొదటి విడత 20 బండ్లు బాంబే పోర్ట్ నుంచి షిప్ లో పంపిస్తునాము. ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. స్వర్ణ మెటల్స్ కు 100 వెహికల్స్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాము. మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజీయాల్లో ఉన్నాము. మేము విదేశాలకు పారిపోతున్నాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Chhattisgarh: రాయ్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన బైక్, ముగ్గురు మృతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ…”ఐదేళ్లు నువ్వు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావా. బీజేపీ నాయకురాలు హైదారాబాద్ లో ఓటు ఉంది. చంద్రబాబు కు హైదారాబాద్ కు ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. నేను విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబు కి పోటీగా నిలబడి ఉన్నాను. 4వ తేదీ ఎన్నికలు ఫలితాలు తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలి. మేము చేసిన సంక్షేమ పథకాలు వల్లే పోలింగ్ పెరిగింది. 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం. దేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రి గా వేల కోట్లు దోచుకున్నది నువ్వు. పోలింగ్ శాతం పెరగటానికి మహిళలే కారణం, ఐ పాక్ టీమ్ ఇదే చెప్పింది. ఏడు నుంచి 8 శాతం పెరిగింది. అందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లు ఘన విజయం సాధిస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. మొదటి నుంచి అదే మాట చెప్తున్నా. ” అని వ్యాఖ్యానించారు.