కథలు కొత్తవి కనిపించక పోతే, పాత కథలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అలా తెలుగు చిత్రసీమలో పలు పాత కథలే కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాయి. వాటిలో కొన్ని ఘనవిజయాలు సైతం సాధించాయి. తన చిత్రాలనే మళ్ళీ కాలానుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి ప్రేక్షకులను రంజింప చేశారు దిగ్దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. 1934లో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ తెలుగు చిత్రసీమలో తొలి బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమానే మరో…
భారతీయ పురాణ, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందునా నటరత్న యన్.టి.రామారావు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆబాలగోపాలానికి పురాణాల్లో దాగిన పలు అంశాలను విప్పి చెప్పాయి. అలాంటి చిత్రమే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు వైకుంఠయానం చేసేటపుడు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే తనతో పాటు తన భక్తుని తీసుకువెళ్ళేవాడు కదా అనే వాదన ఉన్నది. అందునిమిత్తమై, రామాయణంలోని కొన్ని అంశాలను ఆంజనేయునికి రాముడే దేశబహిష్కరణ విధించేలా…
(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద…
నటరత్న యన్.టి.రామారావు హీరోగా దర్శక-నిర్మాత బి.ఆర్.పంతులు తమ పద్మినీ పిక్చర్స్ పతాకంపై జనరంజకమైన చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘గాలిమేడలు’ ఒకటి. 1962 ఫిబ్రవర 9న విడుదలైన ‘గాలిమేడలు’ విశేషాదరణ పొందింది. ఇందులో దేవిక నాయికగా నటించగా, యస్.వి.రంగారావు, చిత్తూరు నాగయ్య కీలక పాత్రలు పోషించారు. ‘గాలిమేడలు’ కథ విషయానికి వస్తే – రంగనాథం అనే షావుకారు టీబీ రోగంతో బాధపడుతూ ఉంటారు. తాను చికిత్స నిమిత్తం వెళ్తూ, తన కొడుకు కృష్ణ ఆలనాపాలనా పానకాలు అనే నమ్మకస్థునికి…
(అక్టోబర్ 6న ‘చిన్ననాటి స్నేహితులు’కు 50 ఏళ్ళు) రియల్ లైఫ్ కేరెక్టర్స్ రీల్ పైనా కనిపిస్తే ఆసక్తిగానే ఉంటుంది. గూంటూరు ఏ.సి. కాలేజ్ లో చదువుకొనే రోజుల్లో నటరత్న యన్.టి.రామారావు, కళావాచస్పతి జగ్గయ్య మిత్రులు. కాలేజ్ లోనే పలు నాటకాలు వేశారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ నాటక సమాజం నెలకొల్పి కూడా వారిద్దరూ పలు నాటకాలు ప్రదర్శించారు. అలాంటి చిన్ననాటి స్నేహితులతో కె.విశ్వనాథ్ అదే టైటిల్ పెట్టి సినిమా తీయడం నిజంగా విశేషమే! యన్టీఆర్, జగ్గయ్య…