ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… తూర్పగోదావరిజిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన… అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ హీరో… సీఎం జగన్మోహన్‌రెడ్డి జీరో అని వ్యాఖ్యానించారు… కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నర్సరీలను సందర్శించి పులకించి పోయారు… నేషనల్ హైవేలకు కడియం మొక్కలు ప్రతిపాదన తీసుకువచ్చారన్న ఆయన… కడియంలో యూనివర్సిటీ తెచ్చేలా ఆలోచన చేస్తున్నారని తెలిపారు.. ఇక, చంద్రబాబు హయాం నుండి జిల్లాలో కడియం అనపర్తి…
ఫిట్‌నెస్ గురించి రకరకాల చాలెంజ్‌లు విసురుకున్నారు.. కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ స్టార్ట్స్, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనడం.. మరికొందరికి సవాల్ విసరడం.. ఆ మధ్య తెగ ట్రెండ్ అయ్యింది.. అయితే, ఇప్పుడు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఎంపీకి విసిరిన చాలెంజ్ చర్చగా మారింది.. బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. కిలోకి వెయ్యి కోట్ల చొప్పున ఇస్తానంటూ ఆ ఎంపీకి సవాల్ చేశారు.. దీంతో, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు…
వైసీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందన్నారు ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విషువర్ధన్ రెడ్డి. నడ్డా పర్యటన తరువాత వైసీపీ నిజ స్వరూపం బయట పడింది. ఏపీలో ఇసుక, భూ, మధ్యం, మైనింగ్ మాఫియా జరుగుతుందన్న నడ్డా ఆరోపణలు నిజం కాదా? దేశంలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. మూడేళ్లలో ఏపీ అభివృద్ధి చెందలేదు… వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయింది. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకొని లబ్ధిదారులకు…
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్లసూర్యప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూరులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గడప గడపకు వెళ్లే ధైర్యం లేక.. పోలీసుల సాయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ముద్దులు పెట్టాడు..ఇపుడు గుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం చేసింది శూన్యం.. అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యం గురించి చెబుతాం అన్నారు. వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టు పనులను టీడీపీ…
పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహాకార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు యాదాద్రి అందాలను చూస్తే మైమరచిపోకుండా ఉండలేరు. అంత రమ్యంగా తీర్చిదిద్దారు యాదగిరి నరసింహుని సన్నిధిని. ఎక్కడా రాజీ…
కృష్ణా జిల్లా ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ హాట్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. తాజాగా నూజివీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల హౌస్ అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. అభివృద్ధికి మేము కారణం అంటే.. మేము కారణం అంటూ ఇరు రాజకీయపార్టీలు సవాళ్లు విసురుకోవడంతో ముందస్తు చర్యగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ…