Students Detained: ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ ముగింపు ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంలో కొందరు విద్యార్థులను, కొన్ని విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఇలా ముందస్తు అరెస్టులు.. గృహ నిర్భంధాలను ప్రయోగిస్తున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎవరు నల్లదుస్తులు సైతం వేసుకోవద్దని యూనివర్సిటీ అధికారులు అనదికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Suresh Raina Captaincy: ఎంఎస్ ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో.. ఎన్నో కెప్టెన్సీ ఆఫర్లను వదిలేశా: రైనా
ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీ సందర్శనకు ముందు తమ వారి ఫ్లాట్‌లలో నిర్బంధించారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ప్రధానమంత్రి పర్యటన కారణంగా తనని మరియు AISA ఢిల్లీ యూనివర్సిటీ సెక్రటరీ అంజలిని వారి ఫ్లాట్‌లోనే నిర్బంధించినట్టు AISA ఢిల్లీ అధ్యక్షుడు అభిజ్ఞాన్ అన్నారు. వారిని యూనివర్సిటీ క్యాంపస్‌లోకి వెళ్లడానికి అనుమతించలేదని తెలిపారు.
ప్రధాని మోదీ పర్యటనకు ముందే తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు AISA తెలిపింది. అయితే ఏ విద్యార్థినీ తాము అదుపులోకి తీసుకోలేదని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో తమను నిర్భందించడానికి ఎటువంటి వారెంట్ గానీ లేదా ఆర్డర్ గానీ చూపలేదని.. ఎంతకాలం ఇలా బంధిస్తారో కూడా తెలియదని అభిజ్ఞాన్ చెప్పారు. పోలీస్ యూనిఫాంలో కూర్చున్న వ్యక్తులు తమ ఫ్లాట్‌ల బయట కూర్చున్న రెండు ఫోటోలను కూడా అభిజ్ఞాన్ తమ ఏఐఎస్‌ఏ ట్విట్టర్‌లో షేర్ చేశారు.