ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టిన తొలి రోజే కొణిదెల పవన్ కళ్యాణ్ శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భగా బాధ్యతలు స్వీకరించిన రోజంతా బిజీబిజీగా గడిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలను కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.