Dancer Satish Complains on Jani Master to Deputy CM Pawan Kalyan: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. జానీ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై ప్రజావాణిలో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశాడు. జానీ మాస్టర్ అరాచకాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కొరియర్ ద్వారా డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని, షూటింగ్‌లకు సతీష్‌ను పిలవవద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్ చేయిస్తున్నాడని పేర్కొన్నారు.
Vishnu Priya Bhimeneni : చీకట్లో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న విష్ణు ప్రియ అందాలు
గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నానని డ్యాన్సర్ సతీష్ పేర్కొన్నారు. తనకు షూటింగ్ చెప్పిన మాస్టర్స్‌ను, కోఆర్డినేటర్‌లను బెదిరిస్తూ.. వారిపై ఫైన్‌లు వేయిస్తున్నాడని సతీష్ ఆరోపించారు. జనరల్ బాడీ మీటింగ్‌లో సమస్యలపై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని సతీష్ పోలీసులకు చేసిన కంప్లయింట్‌లో తెలిపారు. సతీష్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే.