ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
డయేరియా నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
అఖిల పక్షంగా ప్రధానిని కలుస్తాం.. కిషన్ రెడ్డి అవకాశం కల్పించాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణికి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణి కి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మల్లు…
సీజనల్ వ్యాధులపై సమీక్షలో అధికారులను వరుస ప్రశ్నలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కిరిబిక్కిరి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను ఆయన నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు.
Dancer Satish Complains on Jani Master to Deputy CM Pawan Kalyan: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. జానీ మాస్టర్ పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై ప్రజావాణిలో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశాడు. జానీ మాస్టర్ అరాచకాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కొరియర్ ద్వారా డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్…
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే…
గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అందుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.