జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ లో నా కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ నాతో కలిశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ నాతో పొత్తు పెట్టుకుంటనని నాకు జైల్లో కలిసి చెప్పారన్నారు.
పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై ఆరా తీశారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు స్పష్టీకరణ చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించారు. అనుమతుల ప్రకారం రోజుకి 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పతి చేస్తున్నారని పీసీబీ నివేదిక ఇచ్చింది.