Deputy CM Pawan Kalyan: గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యం.. స్వాగతించిన పవన్
- గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామన్న పవన్ కల్యాణ్..
- డిప్యూటీ సీఎంను కలిసిన కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధుల బృందం..
- రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకశాఖలైన.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి బాధ్యతలు తీసుకున్న పవన్.. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్నారు.. ఇక ఈ రోజు పవన్‌తో సమావేశం అయ్యారు కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ మరియు సీఈవో బి.రమేష్ బాబు.. ఈ సందర్భంగా.. కరూర్ వైశ్య బ్యాంక్ తరఫున రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని కరూర్ జిల్లా మనవాడి అనే గ్రామంలో తాము చేస్తున్న కార్యక్రమాలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. జల వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామీణులకు పాడి పరిశ్రమలో చేయూత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ద్వారా ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు లాంటివి అక్కడ చేపట్టమనీ, ఇక్కడ కూడా అలాంటివి చేపట్టగలమనే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: Bahishkarana: అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఇక, కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రతిపాదనలపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను అందించాలని, గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారికి తప్పకుండా సహకారం ఇస్తామనిచెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రవాస భారతీయుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని.. వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులకూ బాధ్యత కల్పించే అంశంపైన ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, ఈ సమావేశంలో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రతినిధులు ఎన్.మురళీకృష్ణ, కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!