అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు.
మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర వెలకట్టలేనిది. మానవ తప్పిదాలు మడ అడవుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. వీటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మడ అడవులను విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్.. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు పవన్ కల్యాణ్.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు అందించింది.. కాకాణిపై పవన్‌కు ఫిర్యాదు చేశారు ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి.. డిప్యూటీ సీఎం పవన్‌ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి.. లక్ష్మికి జరిగిన అన్యాయం వివరించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
Pawan Kalyan: అధికారుల తీరు మీద రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ కొనసాగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా చేశారు.