Deputy CM Pawan Kalyan: ఏనుగుల నుంచి రక్షణకు చర్యలు.. ‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటకతో చర్చలు..
- అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ భేటీ..
- ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యల ప్రస్తావన..
- ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు చర్యలు..
- అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందన్న అధికారులు..
- కర్ణాటకలో కుంకీ ఏనుగుల కోసం చర్చిస్తానన్న డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఏనుగులు ఎప్పటికప్పుడు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా అటవీప్రాంతాలకు దగ్గరగా ఉన్న పంట పొలాలను ధ్వంసం చేయడం.. గ్రామాల్లోకి చొచ్చుకొచ్చిన ఘటనలుతో స్థానికులు భయాందోళలనకు గురయ్యారు.. అయితే, వాటి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించిన పవన్.. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు వస్తున్న సమస్యలను ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉన్నాయన్నారు కనీసం, అయిదు ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చు అన్నారు. స్వయంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకీ ఏనుగుల గురించి చర్చిస్తాను. వారికి మన సమస్యను వివరిస్తాను. ఆ రాష్ట్రం నుంచి ఆ తరహా ఏనుగులు తీసుకు వచ్చేందుకు కృషి చేద్దాం అన్నారు. వన్య ప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకొనే విధానాలు విడిచిపెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అది చట్ట ప్రకారం నేరమని కూడా తెలియచేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!