సచివాలయంలో గ్రూప్ -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని ఆయన…
Mallu Bhatti Vikramarka: లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Mallu Bhatti Vikramarka: ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామని.. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. ఇంకా 6 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నిరుద్యోగులకు వెంటవెంటనే ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరూ మంచిగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు…
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో ఆయన భేటీ అయ్యారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైనీ బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావాల్సిన అనుమతుల గురించి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.
మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారు.. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రానికి నివేదిక పంపారని, అంటే ఆనాటి ప్రకటన బోగస్ అని భావించాలా అని…