హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు సీఎం సహాయనిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందించారు.
గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
Independence Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై జాతీయ జెండా రెప రెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు....
సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు.
షాద్ నగర్ పట్టణ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి శిక్షించిన.. అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం స్పందించారు. కేసు పూర్వపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు.
Telangana Assembly 2024: నేడు ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి..
తెలంగాణ అసెంబ్లీలో రేపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. 2 లక్షల 95 వేల కోట్ల నుంచి 3 లక్షల మధ్య బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.. రాష్ట్ర బడ్జెట్ 2024-25 కు ఆమోదం తెలుపనుంది కేబినెట్.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి…
రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీపై బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.