బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు.
Assembly Budget Session: సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు చర్చ ప్రారంభం కానుంది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి..
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ…
Hyderabad: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానితో భేటీపై స్పందించారు. ‘ప్రధానితో అరంగంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆయనతో చర్చించాం. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. తెలంగాణకు రావాల్సిన వాటిని…
Delhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఢిల్లీలోని ప్రదాని నివాసానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం మోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించన్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇతర అంశాలపై…
6th Day Assemble Meeting: ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో విద్యుత్‌పై స్వల్ప చర్చ జరిగింది. ఈ సందర్భంగా 24 గంటల కరెంట్, విద్యుత్ మొండి బకాయిలపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. యాదాద్రి..భద్రాద్రి..ఛత్తీస్ ఘడ్ పుణ్యమా అని వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ అప్పులు చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుందన్నారు. మాజీ మంత్రి అందరికి అప్పులు ఉంటాయంటున్నారు. మరి నేను ఏమి అప్పులు…
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్ఆర్ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఇన్విటేషన్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎన్ఆర్ఐ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్, మనోహర్ తదితరులు ఉన్నారు. మరోవైపు.. ఈ నెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవా డేస్…
ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి ప్రజాభవన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.