Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి పర్యటన వివరాలు ఇవే..
* ఉదయం 7:45 నిమిషాలకు హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు.
* ఉదయం 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో విజయవాడ కు బయలుదేరుతారు.
* విజయవాడలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు హెలికాప్టర్లో మధిర నియోజకవర్గం కట్టలేరు ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన ఎర్రుపాలెం మండలం మీనవోలు, ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉప్పొంగడంతో ముంపునకు గురైన ప్రకాష్ నగర్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.
* ఉదయం 11:15 గంటలకు సూర్యాపేట జిల్లా మోతే మండలం సింగరేణి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
* ఉదయం 11:30 గంటలకు సింగరేణి పల్లి నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జూజులురావుపేట్ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని నీట మునిగిన పంట పొలాలను, వర్షం నేపథ్యంలో దెబ్బతిన్న ఎన్ఎస్పి కెనాల్ ను పరిశీలిస్తారు.
* మధ్యాహ్నం 12:30 గంటలకు పాలేరు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని ఖమ్మం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను తిలకిస్తారు.
* మధ్యాహ్నం 12:40 గంటలకు పాలేరు ట్యాంక్ బండ్ వద్ద వరద ముంపుతో నష్టపోయిన రైతులతో కేంద్రమంత్రి నేరుగా మాట్లాడుతారు.
* మధ్యాహ్నం 1:30 గంటలకు సింగరేణి పల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
* మధ్యాహ్నం 1:45 గంటలకు సింగరేణిపల్లి హెలీ ప్యాడ్ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాదుకు బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 2: 30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.
Baby Born In Bus: బస్సులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా..