Telangana Assembly 2024: నేడు ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి.. సభలో మూడు ప్రభుత్వ బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సర్కార్ న్యాయ శాఖ బిల్లులు సభలో ప్రవేశ పెట్టింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. సభలో హైదరాబాద్ అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఇవాళ అసెంబ్లీ లోనే కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్నాహ్నం 2.30 కి కమిటీ హల్ 1 లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డుల పై చర్చ జరగనుంది. విది విధానాలపై సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ వేయనున్నారు. వైద్య శాఖలో జీవన్ దాన్ పై చర్చింనున్నారు. GHMC లో మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్లు.. గ్రామాల విలీనం పై చర్చించనున్నారు. ఇక రేపు సభలో GHMC లో విలీనాలపై బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
Read also: Astrology: ఆగస్టు 1, గురువారం దినఫలాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు. సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్… కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అయ్యారని విమర్శించారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నానని, నేను ఎవరిపేర్లు ప్రస్తావించలేదు.. వాళ్లు ఎందుకు బాధ పడ్డారు.. రియాక్ట్ అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మన్న అక్క.. నాకు తోడుండాలి కదా. అక్క అనే అన్నా.. వేరే భాషలో మాట్లాడలేదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Off The Record : తెలంగాణ పాలిటిక్స్ లో పవర్ హై వోల్టేజ్