ప్రభుత్వ రంగం, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. పెద్ద మొత్తం డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటును 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లు మినహా అన్ని డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్బీఐ సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు…