Fire In Train: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ఆదివారం నాడు ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఓ రైల్వే అధికారి ఒకరు విషయాన్ని వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారి తెలిపారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్) నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ రైలు ఇంజిన్‌లో సాయంత్రం 5.30…