హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది.…
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. హైడ్రా బృందం సోమవారం అమీన్ పూర్‌కు చేరుకుంది. జేసీబీలు, డిజాస్టర్ టీంతో సహా పటేల్ గూడకు అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా అధికారులు చేరుకున్నారు.
అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ బాధితులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు కూల్చివేతలు చేపటటారు. మూసీ రివర్ బెడ్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్‌పేట పరిధిలోని శంకర్ నగర్‌లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.