Hyderabad: హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.చెరువుల పునరుద్దరణ చేయడంతో పాటు, నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Hyderabad: గోదావరి రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దీనిలో భాగంగా చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన బఫర్ జోన్‌తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువు పుల్ ట్యాంక్ లెవెల్ (ఎల్. టి. ఎఫ్ ) పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలను చేపట్టడంతో ఈ నిర్మాణాలపై స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడంతో వెలుగు చూసిన ఈ అక్రమ నిర్మాణాలపై హైడ్రా విభాగం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఎఫ్‌వో పాపయ్య నేతృత్వంలో, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ బాల్ రెడ్డి, హైడ్రా విభాగం మార్షల్స్, డీఆర్‌ఎఫ్ బృందాలతో చెరువులోని అక్రమ నిర్మాణాలను పూర్తి తొలగించారు.