మేడ్చల్ మల్కారిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.
చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్‌లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.
తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి బందరి కాలనీ, రాయల్ నగర్ వద్ద ఇళ్ళు కూల్చివేత టెన్షన్ వాతావరణం సృష్టించింది. 40 ఏళ్ళుగా తామిక్కడ నివాసం వుంటున్నామని, తమ అధీనంలో ఉన్న ఇళ్ళను ఇక్కడ ప్రజా ప్రతినిధులు కబ్జా చేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఖరీదైన స్థలం కావడంతో కబ్జా దారుల కన్ను పడిందని మహిళలు ఆరోపిస్తున్నారు. తిరుపతి రెవెన్యూ అధికారులు, పోలిసుల సమక్షంలో కబ్జాలు చేస్తున్నారని మహిళలు అడ్డుకున్నారు. తమ ఆధీనంలో ఇళ్ళకు అన్ని…