దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు
డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇప్పటికే ఢిల్లీ వేదికగా తమిళనాడు డీఎంకే ఎంపీలు పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. తాజా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది.
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
KTR- Harish Rao: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండోసారి సీఎంగా ఎన్నిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “మొదటిసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో మాకు ఓటు వేసారు. కానీ రెండోసారి మాత్రం మాపై నమ్మకంతోనే ఓటు వేస్తారు” అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ, “సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. మేము ఇచ్చిన ప్రతి…
DMK: తమిళనాడు, కేంద్రానికి మధ్య ఇప్పటికే ‘‘హిందీ’’, ‘‘డీ లిమిటేషన్’’ వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఉత్తర, దక్షిణ భారతదేశాలు అంటూ డీఎంకే నేతలు కొత్త వివాదాలను తీసుకువస్తున్నారు. తాజాగా, తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశంలోని మహిళలు అనేక మంది భర్తల్ని కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని అన్నారు. తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని హెచ్చరించారు. Read Also: Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ…
Telangana CM: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు
All-Party Meeting : కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎందుకంటే సౌత్ లోని అన్ని రాష్ట్రాలు గతంలో జనాభాను నియంత్రించాయని.. ఉత్తర భారత రాష్ట్రాలు నియంత్రించలేదు కాబట్టి.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉందని రేవంత్ ఇప్పటికే వివరించారు. ఈ లెక్కన జనాభా ఎక్కువ ఉన్న నార్త్ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని.. పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాల…
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే... కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, త్రిభాషా విధానంపై పోరాటం చేసేందుకు డీఎంకే స్పీడ్ పెంచింది. మార్చి 12న తమిళనాడు వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు డీఎంకే ప్రకటించింది.