K.Keshava Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్‌లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి…
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని…
దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై ఉత్తరాది.. దక్షిణాదిల మధ్య గంభీరమైన వాతవరణం నెలకొంది. చెన్నై కేంద్రంగా డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి సౌత్ సీఎంలు, పలు రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ప్రతినిధులు వైసీపీని కూడా ఆహ్వానించారు. జగన్ గతంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు పలికాయి.
Kishan Reddy : ఇవాళ చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ…
Delimitation: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన శనివారం మొదటి డీలిమిటేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు హాజరయ్యారు.
Hyderabad: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్‌తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు…
నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది.. కానీ, హాజరు కాలేమని సమాచారం ఇచ్చామని జనసేన ప్రకటించింది.. చెన్నైలో డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది.. అయితే, హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు.. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం…
డీలిమిటేషన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డీ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.…
YS Jagan: డీలిమిటేషన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉంది.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది.