Delimitation: తమిళనాడులో డీలిమిటేషన్ (Delimitation) అంశంపై అఖిలపక్ష సమావేశం కీలక తీర్మానాలను ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని, రాబోయే 30 ఏళ్లపాటు అదే అమల్లో ఉండాలని స్టాలిన్ స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రస్తుత లోక్‌సభలో ఉన్న 543 సీట్లనే కొనసాగించాలని తీర్మానించారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోకుండా ఉండాలని, ఇతర…
డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు.
Delimitation: ప్రస్తుతం ‘‘డీలిమిటేషన్’’ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ‘‘జనాభా నియంత్రణ’’ పద్ధతులు పాటించడం ద్వారా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
Jammu Kashmir Elections: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇవ్వడంపై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. “డీలిమిటేషన్” (అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత, జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 43 కాగా, కాశ్మీర్ లోయలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 47 గా విభజించబడ్డాయి. “డీలిమిటేషన్” తర్వాత మొత్తం 90 అసెంబ్లీ స్థానాలే కాకుండా, అదనంగా గవర్నర్ మరో ఐదుగురు సభ్యులను…
డీలిమిటేషన్ ( పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం వినాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కోరారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని ఆయన తెలిపారు.
Women's Reservation Bill: దాదాపుగా మూడు దశాబ్ధాల కల, మోదీ ప్రభుత్వం నెరవేర్చబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. మహిళా బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’గా పేరు పెట్టారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం కోటా రిజర్వేషన్ గా ఇవ్వనున్నారు.
MP Seats: జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత జరిగే లోక్సభ స్థానాల (లోక్సభ స్థానాలు) డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (దక్షిణ భారతానికి) తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.