DMK: తమిళనాడు, కేంద్రానికి మధ్య ఇప్పటికే ‘‘హిందీ’’, ‘‘డీ లిమిటేషన్’’ వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఉత్తర, దక్షిణ భారతదేశాలు అంటూ డీఎంకే నేతలు కొత్త వివాదాలను తీసుకువస్తున్నారు. తాజాగా, తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశంలోని మహిళలు అనేక మంది భర్తల్ని కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని అన్నారు. తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని హెచ్చరించారు.
Read Also: Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ సురక్షితంగా లేదు’’.. G7కి కెనడా వార్నింగ్..
తమిళ ఆచారాల మాదిరిగా కాకుండా, ఉత్తర భారత సంప్రదాయాలు బహుభార్యత్వం, బహు భార్యత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. పరోక్షంగా మహాభారతాన్ని ప్రస్తావిస్తూ, ఉత్తర భారత సంస్కృతి “ఒక స్త్రీ ఐదు లేదా పది మంది పురుషులను వివాహం చేసుకోవడానికి” అనుమతిస్తుందని అన్నారు. ‘‘ మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. కానీ ఉత్తర భారతదేశంలో ఒక స్త్రీ ఐదుగురు లేదా 10 మంది పురుషుల్ని వివాహం చేసుకోవచ్చు. అలాగే ఐదుగురు పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఇది వారి సంస్కృతి. ఒకరు వెళితే మరొకరు వస్తారు’’ అని దురై మురుగన్ అన్నారు.
దేశంలో కాంగ్రెస్ లేదా వేరేవారు అధికారంలో ఉన్నప్పుడు, తమను జనాభాను నియంత్రించాలి కోరారు, దీంతో జనాభా తగ్గిందని, కానీ ఉత్తర భారతదేశంలో జనాభా తగ్గలేదని, వారు 17,18,19 మంది పిల్లలకు జన్మనిచ్చారని వారికి వేరే పని లేదు అని డీఎంకే సీనియర్ నేత అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఎంకే స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తర భారతదేశం పట్ల డీఎంకేకి ఉన్న ద్వేషాన్ని ఇది నిరూపిస్తుందని చెప్పారు.