రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కి, దుండగులకు మధ్య అర్ధరాత్రి భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఘర్షణ జరిగింది.
Delhi : ఉక్కపోతతో పాటు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ రికార్డులను బద్దలు కొట్టింది. గురువారం ఢిల్లీలో 6780 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవగా, గతేడాది మేలో గరిష్టంగా 5781 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Bomb In Flight: ఢిల్లీ నుండి వడోదరకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు బుధవారం ప్రయాణికులలో భయాందోళనలకు కారణమైంది. వివరాల ప్రకారం., విమానంలో ఉన్న ఓ టిష్యూ పేపర్ పై ఒక నోట్ గా “బాంబు” అనే పదాన్ని రాసి ఉండి గమనించడంతో ఈ సంఘటనకు కారణమైంది. విమానంలోని టాయిలెట్ లో ఆ నోట్ దొరికింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నోట్ దొరికిన తర్వాత విమానంలో సదరు…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు విభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించిన మహిళా కమిషన్ మే 17న ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరుకావాలని విభవ్ కుమార్‌ను ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి.
ఇండిగో విమానం రద్దవడంతో మదర్స్ డే రోజు తన అమ్మను కలవలేకపోయానని.. అనుభా పాండే అనే జర్నలిస్ట్ తెలిపారు. 11వ తేదీన ఉదయం 10.40 నిమిషాల విమానానికి ఢీల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇంట్లోనే ఏకంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి.. ఆమెపై దాడికి తెగబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది.