Shraddha Walkar case: శ్రద్ధావాకర్ మర్డర్ కేసులో మరిన్ని ఆధారాలతో మరో ఛార్జిషీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walkar case: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య 2022లో సంచలనం సృష్టించింది. అఫ్తాబ్ పూనావాలతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న శ్రద్ధాను అతనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. శ్రద్ధాని చంపేసి 35 ముక్కులుగా కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో రాత్రిళ్లు పడేసేవాడు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ కేసు, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
Read Also: Hyundai: గ్రామీణ భారతాన్ని “హ్యుందాయ్” ఎలా ఆకట్టుకుంటోంది..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మరిన్ని సాక్ష్యాలతో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. అఫ్తాబ్ పూనావాలపై నేరారోపణ చేసేందుకు ఢిల్లీ పోలీసులు డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిని అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టు వర్గాలు మంగళవారం తెలిపాయి. దాదాపుగా 3000 పేజీల చార్జిషీట్‌ని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా ముందు దాఖలు చేసినట్లు వారు తెలిపారు.
అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను మే 2022లో ఢిల్లీలోని మెహ్రౌలీలో హత్య చేశాడు. ఇతనిపై ఐపీసీ 302(హత్య), 201( నేర సాక్ష్యాలు మాయం చేయడం) వంటి అభియోగాలు మోపారు. చార్జిషీట్‌లో ప్రధానంగా గూగుల్ లొకేషన్‌లు, సెర్చ్ హిస్టరీ మరియు ఇతర డిజిటల్ మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల నివేదికలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. గతేడాది జనవరిలో ఇతనిపై 6,629 పేజీల చార్జిషీట్ దాఖలు చేయబడింది.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!