YS Jagan Protest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురి కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి మాజీ సీఎం జగన్ కంప్లైంట్ చేయనున్నారు.
Read Also: Big News : KGF -3కి మూహుర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్…హీరో ఎవరో తెలుసా..?
అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే (టీడీపీ+ జనసేన+ బీజేపీ) కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరే అవకాశం ఉంది. ఇవాళ్టి ధర్నాలో హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించేందుకు వైసీపీ నిర్ణయించింది. ఇక, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు.