మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
YS Jagan Protest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు.
పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు.
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలను కలిశామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు…
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్‌కు మంత్రి తెలిపారు. అలాగే.. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.
Telangana CM Revanth Reddy Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం ఢిల్లీ బయల్దేరారు. కాసేపటిక్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానంకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు వరంగల్‌లో ‘రైతు కృతజ్ఞత’ సమావేశానికి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. Also Read:…