Shashi Tharoor: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంలో పెరిగిపోతుంది. దీనికి తోడు పొగ మంచు కప్పేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత తీవ్ర స్థాయికి పడిపోతుంది. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 మార్క్ ను తాకింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రియాక్ట్ అయ్యారు.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని క్వశ్చన్ చేశారు.
Read Also: Russia-Ukraine War: నేటితో 1,000వ రోజుకు చేరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
అయితే, కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. అలాగే, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకా ( బంగ్లాదేశ్ రాజధాని ) పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు అని పోస్ట్ చేశారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండటం లేదని విమర్శించారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం కొనసాగించగలం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ శశిథరూర్ ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు.
Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722
— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024