CM Chandrababu: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు!
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం
- ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో ప్రచారం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో సీఎం ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది. తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఏపీ సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సమయం ఆసన్నమవుతుండంతో ప్రచారం జోరందుకుంది. పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి బీజేపీ అగ్రనాయకత్వం దింపుతోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ సీఎం చంద్రబాబును బీజేపీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం సిద్దమయ్యారు. ఎన్టీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!