Covid-19 Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఆ రాష్ట్రంలోనే ఎక్కువ రోగులు..
- దేశవ్యాప్తంగా 4,026 దాటిన యాక్టివ్ కరోనా కేసులు..
- కేరళలో అత్యధికంగా 1,416 యాక్టివ్ కేసులు నమోదు..
- ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వ్యాప్తికి కారణమని ఐసీఎంఆర్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19 Cases: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ (మంగళవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో ఐదుగురు కరోనా సోకి చనిపోయారు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: Telangana Jagruthi : ఇందిరా పార్క్ వద్ద రేపు తెలంగాణ జాగృతి మహాధర్నా
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళ మొదటి స్థానంలో కొనసాగుతుండటంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. మంగళవారం ఒక్కరోజే కేరళలో 171 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 1,416కి చేరింది. ఇక, ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కు చేరగా, మహారాష్ట్రలో 69 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 494కు చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 11 కేసులు నమోదు అవగా.. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
Read Also: Venkateswara Rao: జగన్‌పై దాడి కేసు.. పోలీసుల దెబ్బలకు నేటికీ అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు..!
అయితే, ఇండియాలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ ధృవీకరించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవి కాదని స్పష్టం చేశారు. తాజా, పరిస్థితి ప్రజలు గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలి.. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- Tags
- corona Cases
- Covid 19
- Delhi
- india
- Kerala
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!