Bharat Bandh: నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు మోడీ సర్కార్ దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైతన్నలు సిద్ధమయ్యారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్ బంద్ లో పాల్గొని సక్సెస్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది.
Read Also: Sarfaraz Khan: నా తప్పే.. సారీ సర్ఫరాజ్: జడేజా
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఇక, కేంద్ర ప్రభుత్వం తీరుపై రైతులు సంఘాలు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పంజాబ్, హరియాణా నుంచి ఢిల్లీ వైపు వెళ్తుండగా వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బారికేడ్లు వేసి భారీగా భద్రతా ఏర్పాట్లతో వారందరినీ ఢిల్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారు. అంతే, కాకుండా.. హరియాణాలో.. రైతులపై టియర్ గ్యాస్ ను సైతం ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న భారత్ బంద్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేటి ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు.
Read Also: Stock Market : మార్చి 2న శనివారం కూడా మార్కెట్ ఓపెన్.. ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌కు కారణమిదే
ఇక, రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్లు ఉన్నాయి..
1. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం.
2. రైతు రుణ మాఫీ.
3. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.
4. 2020 విద్యుత్ చట్టం ఉపసంహరణ.
5. లఖింపుర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం.
6. గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
మరి రైతులు పిలుపునిచ్చిన
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!