ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఎల్లుండి (ఈ నెల 14న) బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇవాళ రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు సీఎం.
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని, స్వాతంత్ర్యం తరువాత ఇదే దేశంలో అతి పెద్ద విధ్వంసమని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో కాషాయ పార్టీ బుల్డోజర్లు ఇదే తరహాలో తిరిగితే నగరంలో 63 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)…