Nose pin: భార్యని చంపి, మురికి కాలువలో మృతదేహాన్ని పడేసిన కేసులో భర్త నిందితుడిగా తేలాడు. దాదాపు నెల రోజుల క్రితం ఢిల్లీలోని ఒక మురికి కాలువలో ఒక మహిళ మృతదేహం లభించింది. అయితే, ఈ కేసును పరిష్కరించడానికి పోలీసులకు మహిళ ‘‘ముక్కుపుడక’’ సాయం చేసింది. దీని ఆధారంగా దర్యాప్తు చేయగా భర్త అనిల్ కుమార్‌ని నిందితుడిగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మార్చి 15న మృతదేహాన్ని బెడ్ షీట్‌లో చుట్టి, రాయి, సిమెంట్ బస్తాకు కట్టిని స్థితిలో మహిళ మృతదేహాన్ని మురికి కాలువలో కనుగొన్నారు. పోలీసులు ఆమె ముక్కు పుడక ఆధారంగా చనిపోయిన వ్యక్తిని మహిళగా గుర్తించారు. ఈ ముక్కు పుడక పోలీసుల్ని ఢిల్లీలోని ఒక ఆభరణా దుకాణానికి తీసుకెళ్లింది. రికార్డులు తనిఖీ చేయగా, గురుగ్రామ్‌లోని ఒక ఫామ్ హౌజ్‌లో నివసించే ఢిల్లీకి చెందిన వ్యాపారి అనిల్ కుమార్ కొనుగోలు చేసినట్లు తేలింది. బిల్లు అతడి పేరు మీద జారీ చేయబడింది.
Read Also: Sanjay Raut: బీహార్ ఎన్నికలకు ముందే తహవూర్ రాణాని బీజేపీ ఉరి తీస్తుంది..
అనిల్ కుమార్‌ని పోలీసులు సంప్రదించగా, మరణించిన వ్యక్తి సీమా సింగ్ అని, అతడి భార్య అని కనుగొన్నారు. అధికారులు ఆమెతో మాట్లాడాలని కోరినప్పుడు ఆమె బృందావన్ కి వెళ్లిందని, తనకు చెప్పకుండానే వెళ్లిందని చెప్పాడు. ఇది పోలీసుల్లో అనుమానాన్ని రేకెత్తించింది. పోలీసులు ద్వారకలోని అనిల్ కుమార్ ఆఫీసుకు వెళ్లిన సమయంలో, అక్కడ డైరీలో అతడి అత్తగారి నెంబర్ దొరికింది. ఆమెను సంప్రదించడంతో మృతురాలు సీమా సింగ్ సోదరి బబిత మాట్లాడుతూ.. ఆమె మార్చి 11 నుంచి తమతో మాట్లాడలేదని చెప్పింది.
మరోవైపు, పోలీసులు అనిల్ కుమార్‌ని సంప్రదించినప్పుడు సీమా జైపూర్‌లో ఉందని, ఆమె మాట్లాడే మూడ్‌లో లేదని చెప్పాడు. ఏప్రిల్ 01న ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించడానికి కుటుంబ సభ్యుల్ని పోలీసులు పిలిచారు. అయితే, మృతురాలు సీమా సింగ్ అని ఆమె కుటుంబీకులు కనుగొన్నారు. సీమా సింగ్ గొంతు కోసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో అనిల్ కుమార్‌తో పాటు అతడి గార్డు శివ శంకర్‌ని అరెస్ట్ చేశారు.