ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మార్చి 11న ఆమె ఈడీ ముందు హాజరయ్యారు. ఆమెను ఈడీ తొమ్మిది గంటల పాటు విచారించింది. అయితే.. మరోసారి మార్చి 16న ఈడీ విచారణ హాజరుకావాలని కవితకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. దీంతో.. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో యథావిధిగా రేపు ఈడీ విచారణ కవిత హాజరుకానున్నారు.
Also Read : Currency Notes On Road : కదులుతున్న కారునుంచి కరెన్సీ నోట్లు
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అంతేకాకుండా.. ఈ కేసులో ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ నేడు ఢిల్లీలోని ఆఫీస్‌లో విచారించనున్నది. ఇప్పటికే రెండుసార్లు నోటీసు జారీచేసినా.. కొన్ని వ్యక్తిగత కారణాలతో హాజరు కాని బుచ్చిబాబు చివరకు నేడు ఈడీ ముందుకు రానున్నారు. ఈ కేసులో సౌత్ గ్రూపు తరఫున ఎమ్మెల్సీ కవితకు కూడా ప్రమేయం ఉన్నదని ఈడీ ఆరోపిస్తున్న సమయంలో ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును తాజాగా విచారణకు పిలుస్తుండడం గమనార్హం.
Also Read : Village Road Bridge: వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి.. మర్రిచెట్టే వారికి వంతెన
ఈడీ నోటీసుల పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత.. కీలక అంశాలను తన పిటీషన్ లో ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదని, ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిరాదరణ ఆరోపణలను నాపై మోపుతున్నారన్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నేతలు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తనకు ఇచ్చిన సమన్లని రద్దు చేయాల్సిందిగాను పిటిషన్ లో కవిత కోరారు. తనను ఈడీ కార్యాలయం వద్ద కాకుండా తన ఇంటి వద్ద విచారించాలని పిటిషన్ లో కోరిన కవిత.. ఈడీ జరుపుతున్న విచారణ చట్ట వ్యతిరేకమన్నారు. విచారణకు హాజరైన సమయంలోనూ నా పట్ల చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని, తక్షణం నా వ్యక్తిగత ఫోన్ జమ చేయాల్సిందిగా కోరారని, నా ఫోన్ ని ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారో కనీసం వివరణ ఇవ్వలేదన్నారు కవిత