Delhi High Court: మహిళల ప్రైవసీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాత్ రూంలో స్నానం చేయడమనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అని, ఒక వేళ బాత్ రూం ఇంటి బయట ఉన్నా, తాత్కాలిక నిర్మాణమైనంత మాత్రాన అక్కడ స్నానం చేయడం బహిరంగ చర్యగా పేర్కొనలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు…
ఉద్యోగాల కోసం భూ కుంభకోణం(Land-For-Jobs Scam Case) కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ను సీబీఐ ఈరోజు తన ప్రధాన కార్యాలయంలో ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు.
Delhi High Court: భార్య నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటున్న భర్త కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతను అప్లై చేసుకున్న విడాకులను కోర్టు సమర్థించింది. ప్రతీ వ్యక్తి కూడా గౌరవంగా జీవించడానికి అర్హులని..నిరంతర వేధింపులతో ఎవరూ జీవించకూడదని పేర్కొంది. భార్యతో విడిపోవడాన్ని సమర్థించింది. భార్య వేధింపులతో భర్త విడాకులు కోరాడు. ఈ కేసులో 2022 జూలైలో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్…
Minor Moves Delhi High Court For Termination Of 16-Week Pregnancy: తన గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్ల మైనర్ తన తల్లి సహాయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ అయిన బాలిక, మరో మైనర్ బాలుడు లైంగిక చర్య ద్వారా గర్భాన్ని దాల్చింది. దీంతో వైద్యపరంగా తన గర్భాన్ని రద్దు చేయాలని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. బాలిక, బాలుడు ఏకాభిప్రాయం ద్వారా లైంగిక చర్యలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం…
పరీక్షల్లో కాపీ కొట్టడం, మోసం చేయడం సమాజాన్ని, విద్యావ్యవస్థను నాశనం చేసే మహమ్మారి లాంటిదని, అన్యాయమైన మార్గాలను ఉపయోగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
తన భార్య సునంద పుష్కర్ మృతి కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత శశిథరూర్ను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నగర పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. థరూర్ తరపు న్యాయవాదికి తన పిటిషన్ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాదిని జస్టిస్ డీకే శర్మ కోరారు.
The Supreme Court released the three accused under the benefit of doubt: 2012లో ఢిల్లీలో జరిగిన అత్యాచార కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు సోమవారం విడుదల చేసింది. ఈ ముగ్గురిపై కేసు నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘‘ బెనిఫిట్ ఆఫ్ డౌట్’’ కింద ఈ ముగ్గురిని విడుదల చేసింది. 2019లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య, చిత్ర హింసలు కేసు కింద ముగ్గురికి ట్రయల్ కోర్టు…