Delhi High Court: భర్తపై నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో అతడిని ‘స్త్రీలోలుడి’గా చిత్రీకరించడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట అని, ఇది వివాహ రద్దుకు కారణమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం భర్త దాఖలు చేసిన క్రూరత్వానికి సంబంధించిన విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలని, అవసరమైన సమయాల్లో రక్షణ కవచంలా ఉండాలని ఆశిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశిస్తూ ‘‘పిక్‌పాకెట్స్’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఆయన ప్రకటన తప్పుగా ఉందని, 8 వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్‌లతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Delhi High Court: విడిపోయిన భార్యభర్తల నెలవారీ భరణానికి సంబంధించిన కేసును విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుకమైన సంపాదించగల సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి, తగిన వివరణ లేకుండా నిరుద్యోగిగా, పనిలేకుండా ఉండకూడదని, తన ఖర్చులను భర్త ఏకపక్షంగా భరించడానికి అనుమతించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ) కింద విడిపోయిన భార్యకు భర్త చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.30,000 నుంచి 21,000లకి తగ్గిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Kerala Nurse: దేశం కాని దేశంలో కేరళకు చెందిన నర్సుకు మరణశిక్ష పడింది. యెమెన్ దేశంలో అక్కడి పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో భారత్‌కి చెందిన నిమిషా ప్రియకు మరణశిక్ష విధించబడింది. అయితే తాజాగా మరణశిక్ష అప్పీల్‌ని అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మరణశిక్ష ఖాయంగా కనిపిస్తోంది. ప్రియా తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తికి మత్తుమందు ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో దోషిగా నిర్థారించడంతో మరణశిక్ష విధించబడింది. చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థనను…
Delhi High Court: మైనర్‌పై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అత్యాచార బాధితురాలు, నిందితుడి మధ్య వివాహం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని, అతనిపై వచ్చిన అభియోగాలు తీవ్రమైన స్వభావం కలిగినవని హైకోర్టు పేర్కొంది. ఇరు పక్షాల మధ్య కుదిరిన సెటిల్మెంట్ ఆధారంగా అత్యాచార నేరాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ప్రస్తావించారు.
Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత…
పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది.
BRS Leaders: కారు గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని ఎన్నికల కమిషన్కు నివేదించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ కోర్టులో విచారణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. దీంట్లో కేసు విచారించిన పోలీసులు కొన్ని విషయాలు కోర్టుకు వెల్లడించారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల విషయంలో తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్భూషణ్ సింగ్ వదులుకోలేదని కోర్టుకు…