Aishwarya Rai Daughter : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనుమరాలు, ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో గెలిచారు. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై యూట్యూబ్ లో వచ్చిన తప్పుడు ప్రచారంపై కోర్టు సీరియస్ అయింది. ఆరాధ్యపై వచ్చిన వీడియోలను వెంటనే తొలగించాలని గూగుల్ సంస్థను కోర్టు ఆదేశించింది. అలాగే తప్పుడు వీడియోలు అప్ లోడ్ చేసిన సదరు యూట్యూబ్ ఎకౌంట్ల వివరాల్ని కూడా అందించాలని కోరింది.
Read Also: Ponniyin Selvan 2: చోళులు వచ్చేసారు… ఈసారైనా నిలబడతారా?
కొన్ని రోజుల క్రితం కొన్ని బాలీవుడ్ యూట్యూబ్ ఛానెళ్లు ఆరాధ్య బచ్చన్ పై పలు కథనాలను ప్రసారం చేశాయి. వీటిలో ఐశ్వర్య కూతురి ఆరోగ్యం బాగాలేదని చూపించాయి. మరికొన్ని యూట్యూబ్ చానెళ్లు అసలు ఆరాధ్య చనిపోయిందంటూ వీడియోలు పెట్టాయి. వీటిపై ఆగ్రహించిన అభిషేక్ తో కలిసి ఆరాధ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మైనర్ బాలికలపై వచ్చిన ఇలాంటి కథనాలు పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి కథనాలు చట్టప్రకారం సహించరానివని కోర్టు తెలిపింది. ఆరాధ్యపై ఫేక్ వార్తలు ప్రసారం చేసిన తొమ్మిది యూట్యూబ్ ఛానెళ్లను కోర్టు నిషేధించింది. ఇకపై ఆ అకౌంట్స్ నుంచి ఏ సామాజిక మాధ్యమంలో ఎలాంటి కథనాలు రావడానికి వీల్లేదని, ఛానెళ్లు నడుస్తున్నట్టు తెలిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Read Also: Punch Prasad : ‘ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తే నా కిడ్నీ ఇస్తా’ : ప్రసాద్ భార్య