Supreme Court To Hear Plea on marital rape: వివాహ అనంతరం భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇంతకుముందు ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం విరుద్ధమైన తీర్పులు ఇవ్వడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కాగా ఈ కేసును సెప్టెంబర్ 16న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త-పార్ట్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. రణబీర్ పూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్కు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండటం చిత్రబృందాన్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. దీనిపై స్టార్ ఇండియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని అనధికారికంగా…
CJI NV Ramana retires today: భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)గా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021లో బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 26, 2022న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా చివరి రోజు పలు హై ప్రొఫైల్ కేసులును విచారించారు. గురువారం రోజు పెగాసస్ స్పైవేర్ కేసుతో పాటు, ఇటీవల…
Smriti Irani defamation case on Illegal Bar allegations: కాంగ్రెస్ నేతలు ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నాంటూ విమర్శించారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ స్మృతి ఇరానీని తన పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్మృతి ఇరానీ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు…
Dhoni gets supreme courts notice in arbitration proceedings against Amrapali Group: ఆమ్రపాలి గ్రూప్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. అయితే ఆ సమయంలో తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని ఆమ్రపాలి కంపెనీ ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ 2019 మార్చిలో ధోనీ…
Cyber Fraud With Delhi High Court Justice Satish Chandra Sharma WhatsApp DP: సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జాగ్రత్తలు సూచిస్తున్నా.. అవి ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. జనాలకు కుచ్చటోపీ వేస్తూనే ఉన్నారు. లక్షలు, కోట్ల రూపాయల్ని నిలువునా దోచేస్తున్నారు. జనాలు పక్కాగా నమ్మేలా, కొత్త కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సాప్ డీపీతోనే…
వ్యాపారులు ఇటీవల కొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. తమ బిజినెస్ చక్కగా సాగాలనే ఉద్దేశంతో పాపులర్ అయిన పేర్లను షాపులకు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్బుక్ దూసుకుపోతోంది. ప్రతి మొబైల్లో ఫేస్బుక్ ఉండాల్సిందే. ఈ మధ్య ఫేస్బుక్ లైవ్స్, రీల్స్ కూడా నెటిజన్లు చేసేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారి ఫేస్బుక్ పేరును వాడి లబ్ధి పొందాలని ప్రయత్నించాడు. అచ్చంగా అదే పేరు పెడితే కేసు అవుతుందని భావించి తన బేకరీకి ‘ఫేస్ బేక్’ అని పేరు…
సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది.. ట్విట్టర్ హ్యాండిల్ బ్లూ టిక్ను పునరుద్ధరించాలని గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు నాగేశ్వరరావు.. అయితే, బ్లూ టిక్ పునరిద్ధరించాలని ట్విట్టర్ కోరిన పునరుద్ధరించకపోవడంపై మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ మాజీ డైరెక్టర్.. అయితే, ట్విట్టర్ లో బ్లూటిక్ను పునరుద్ధరించాలని తాజాగా హైకోర్టులో పిటిషన్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ విచారించేందుకు నిరాకరించింది.. అంతేకాదు.. సీబీఐ…