Medicine: ఇప్పుడు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ దుకాణాలు వినియోగదారులకు మందులను విక్రయించలేవు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించకూడదని మెడికల్ షాపులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతూ మెడికల్ స్టోర్ యజమాని కనిపిస్తే అతడు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. వాస్తవానికి సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి మందులను మెడికల్ స్టోర్లు విక్రయించరాదని ప్రభుత్వం మెడికల్ స్టోర్‌లను ఆదేశించింది.
Read Also:America: రష్యాపై అమెరికా క్లస్టర్ ఆయుధాలు.. ఉపయోగిస్తున్న ఉక్రెయిన్
ఔషధ నియంత్రణ విభాగం కూడా నొప్పి నివారణ మందుల రికార్డులను ఉంచాలని షాపు యాజమాన్యాలకు సూచించింది. ఇటీవల పెరుగుతున్న డెంగ్యూ కేసులను దృష్టిలో ఉంచుకుని, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వాటి సీజనల్ వ్యాధుల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం మెండుగా ఉందని ఔషధ నియంత్రణ విభాగం తెలిపింది. ఇటువంటి వ్యాధులను చాలా కఠినంగా పర్యవేక్షించాలి.
Read Also:Baby Movie Collections: వర్షంలోనూ ఆగని వసూళ్లు.. ఫస్ట్ వీక్ ‘బేబి’ కలెక్షన్స్ ఎంతంటే?
వాస్తవానికి, డెంగ్యూ చికిత్స కోసం ప్రజలు సాధారణంగా ఇబుప్రోఫెన్, డిక్లోఫెనాక్ వంటి మందులను తీసుకుంటారు. దీనివల్ల ప్రజలు తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల, రిటైల్ డ్రగ్ డీలర్లు తదుపరి సూచనల వరకు తక్షణ ప్రభావంతో ఓవర్ ది కౌంటర్ సేల్‌లో యాస్పిరిన్, ఇబుప్రోఫెన్, డిక్లోఫెనాక్ వంటి మందులను చేర్చవద్దని సూచించారు. దీనితో పాటు ఈ మందులను ట్రాక్ చేయడం కూడా మంచిది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ తెలిపింది. అటువంటి మందులను అనియంత్రిత ఉపయోగం వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల రోగులకు ప్రాణాంతకం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మందుల వాడకం వల్ల మనిషి రక్తంలో ప్లేట్‌లెట్స్ లోపం ఏర్పడుతుంది.