తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్! తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే, ఫిబ్రవరి 3వ తేదీన వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది.. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే…
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్‌కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య భారీ పోటీ నెలకొంది. పోటాపోటీగా ఇరు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా, ఆప్ మరోసారి ఢిల్లీ ప్రజలపై హామీల జల్లు కురిపించింది. సోమవారం తన మానిఫెస్టోని విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు నడుస్తోంది. నామినేషన్ల సమర్పణకు గడువు దగ్గర పడింది. ఇంకోవైపు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తు్న్నారు.
ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 3 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి హనుమాన్, వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు.