దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బీజేపీ ఇప్పటి వరకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. తాజాగా మూడో మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మూడో మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. సంకల్ప్ పత్రలో బూటకపు వాగ్దానాలు లేవని.. ఢిల్లీలో చేయాల్సిన పనులను గూర్చే హామీలు ఇస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు . పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఆగిపోవని.. బీజేపీ అన్ని హామీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Thandel: ప్రమాదంలో తండేల్ డైరెక్టర్ సహా సినిమాటోగ్రాఫర్.. ఏమైందంటే?
ఇప్పటికే మొదటి విడత హామీలో మహిళలు లక్ష్యంగా వాగ్దానాలు చేసింది. రెండో విడతలో యువత, విద్యార్థులు లక్ష్యంగా హామీలు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ సంస్థల్లో నిరుపేద విద్యార్థులకు ప్రీ-స్కూల్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీల వరకు ఉచిత విద్య, రూ. 15,000 నగదు సాయం.. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ రీయింబర్స్‌మెంట్‌తో పాటు పలు ఉచిత హామీలను ఇచ్చింది. అంతేకాకుండా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నెలవారీ రూ.1,000 స్టైఫండ్ అందుతుందని బీజేపీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Republic Day 2025 : తెలంగాణలో విశిష్ట సేవా పతకాలు వచ్చింది వీరికే
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. అధికారం కోసం పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah releases the BJP 'Sankalp Patra' at party headquarters ahead of the #DelhiElections2025. Delhi BJP President Virendraa Sachdeva and other senior party leaders also present. pic.twitter.com/sFFvcSEUhT
— ANI (@ANI) January 25, 2025