In Shraddha Walkar Murder Case, Cops Find New Audio Proof: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధావాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాాలా, శ్రద్ధాతో గొడవపడుతున్న ఆడియో క్లిప్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈ ఆడియో క్లిప్ కీలకంగా పరిగణిస్తున్నారు పోలీసులు. దీన్ని పెద్ద సాక్ష్యంగా పరిణిస్తున్నారు. ఈ భయంకరమైన హత్యకు సంబంధించి అఫ్తాబ్ ఉద్దేశాన్ని నిర్థారించేందుకు ఈ ఆడియో క్లిప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
Shraddha Walker: దేశాన్ని గడగడలాడించిన హత్య శ్రద్దా వాకర్. ప్రేమించిన అమ్మాయిని అతి దారుణంగా చంపి 35 ముక్కలు చేశాడు ఒక కీచక ప్రేమికుడు. ఇక ఆరునెలల తరువాత బయటపడిన ఈ హత్యకేసులో హంతకుడు అఫ్తాబ్ ను పోలీసులు ఢిల్లీ పోలీసులు నవంబర్ 22న ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచిన విషయం తెల్సిందే.