Shraddha Walker: దేశాన్ని గడగడలాడించిన హత్య శ్రద్దా వాకర్. ప్రేమించిన అమ్మాయిని అతి దారుణంగా చంపి 35 ముక్కలు చేశాడు ఒక కీచక ప్రేమికుడు. ఇక ఆరునెలల తరువాత బయటపడిన ఈ హత్యకేసులో హంతకుడు అఫ్తాబ్ ను పోలీసులు ఢిల్లీ పోలీసులు నవంబర్ 22న ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచిన విషయం తెల్సిందే. ఇక కోర్టు లో అఫ్తాబ్.. శ్రద్దాను చంపిన రోజున ఏం జరిగిందో పూసా గుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. శ్రద్దాను నేనే చంపాను .. ఆరోజు పెళ్లి చేసుకోమని ఎంతో విసిగించింది. దీంతో ఆమెతో గొడవకు దిగాను. ఎంతకు ఆమె ఆపలేదు. ఇక క్షణికావేశంలో ఆమెను హత్య చేశాను. శరీరాన్ని బయటపారేయడం కష్టం కాబట్టి రంపం తెచ్చి 35 చిన్న ముక్కలు చేశాను. ఒకేసారి అన్నీ పడేస్తే అనుమానం వస్తుందని ఒక్కొక్కటి ఒక్కో చోట విసిరేశాను. ఈ విషయాన్ని పోలీసులకు ఇప్పటికే చెప్పాను.
పోలీసుల దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పాను. శ్రద్ధ శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పాను. నేను కావాలని శ్రద్దాను చంపలేదు.. క్షణికావేశంలో చంపాను.. నేను అబద్దం చెప్పడం లేదు. ఆరునెలలు కావడంతో కొన్ని సంఘటనలు గుర్తులేవు. నమ్మండి” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక అఫ్తాబ్ చెప్పినవన్నీ నిజమైతే ఆమెను కోయడానికి ఉపయోగించిన రంపం, బ్లేడులు అడవిలో పడేశాను అని చెప్పడంతో పోలీసులు అక్కడ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అతడిని నమ్మాలో వద్దో అని పోలీసులు సైతం ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కోర్టు కూడా అనుమతించింది. అలాగే నార్కో అనాలిసిస్ పరీక్షను నిర్వహించడానికి సంసిద్దమవుతున్నారు.మరి ఇందులోనైనా అఫ్తాబ్ బయటపెడతాడా..? అనేది తెలియాల్సి ఉంది.