DC vs GT: ఐపీఎల్-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 199 రన్స్ చేసింది.
KL Rahul: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేశాడు.
భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తల మధ్య ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పదం కుదరడంతో.. మే 17 నుంచి మ్యాచ్లు పున:ప్రారంభం కానున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం.. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు.. తిరిగి భారత్కు చేరుకుంటున్నారు. అయితే కొందరు ప్లేయర్స్ తాము ఐపీఎల్ 2025కి…
DC vs SRH: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే వికెట్ పడింది. అలా మొదలైన బ్యాటింగ్ చివరి వరకు విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డీసీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే కరుణ్ నాయర్ (0) వికెట్ కోల్పోయారు. వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8) వరుసగా ఔటవుతుండటంతో జట్టు…
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు పోటీ పడ్డాయి. 13 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగా.. మరో 12 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.
ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీనే. గతంలో విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తుంది. 17 ఏళ్లుగా టైటిల్ కరువులో ఉన్న ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాప్2 లో కొనసాగుతుంది. అయితే కోహ్లీ ఢిల్లీ వాసి అయినప్పటికీ ఢిల్లీ తరఫున ఆడకుండా బెంగుళూరు తరఫున ఎందుకు ఆడుతున్నాడన్న డౌట్ రావొచ్చు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంటే 2008కి ముందు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా ఢిల్లీ, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో, కోల్కతా ఢిల్లీని 14 పరుగుల తేడాతో ఓడించింది. ఢిల్లీపై కోల్కతా ఉత్కంఠ విజయం సాధించింది. కోల్కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన…
KKR vs DC: ఐపీఎల్లో నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన డీసీ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ (KKR) అద్భుతంగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై భారీ స్కోర్ నమోదు చేసింది. కేకేఆర్కి రాహ్మానుల్లా గుర్బాజ్ 12 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 26 పరుగులతో విరుచుకపడ్డాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 16…
DC vs KKR: ఐపీఎల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు రెండింటికీ కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆప్స్ చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా విజయం సాధించి ప్లేఆప్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ భారీ…
DC vs RCB: ఢిల్లీ వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడి కేవలం 11 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ 15…