BrahMos: స్వదేశీ టెక్నాలజీ, ఆత్మ నిర్భర భారత్‌లో కీలక మైలురాయికి చేరుకుంది. కొత్తగా లక్నోలో ప్రారంభించిన ఫెసిలిటీతో తయారైన ‘‘బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి’’ మొదటి బ్యాచ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జరగబోయే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు హాజరుకానున్నారు. యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లోని భట్‌గావ్ లో ఉన్న లక్నో యూనిట్‌ను మే 11న రక్షణ మంత్రి అధికారంగా ప్రారంభించారు. 80 హెక్టార్లలో సుమారుగా రూ. 300 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీంట్లో పెద్ద ఎత్తు క్షిపణులను తయారు చేస్తున్నారు.
Read Also: Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..
ఈ ప్లాంట్ ప్రతీ ఏడాది 80-100 క్షిపణుల్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత దీనిని 150 పెంచాలని ప్లాన్ చేస్తు్న్నారు. ఈ ప్లాంట్ దేశ రక్షణను బలోపేతం చేయడంతో పాటు విదేశాలకు ఈ క్షిపణుల్ని ఎగుమతి చేసే సామర్థ్యాన్ని మరింతగా పెంచింది. బ్రహ్మోస్ భారత్, రష్యాల జాయింట్ వెంచర్. భారతదేశానికి 50.5 శాతం, రష్యాకు 49.5 శాతం వాటాలు ఉన్నాయి. శనివారం జరిగే కార్యక్రమంలో లక్నో నుంచి మొదటి బ్యాచ్ క్షిపణుల అధికారిక డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఈ క్షిపణి దాదాపుగా మాక్ 3 వేగంతో పనిచేస్తుంది. అంటే శబ్ధ వేగానికి దాదాపుగా 3 రెట్లు ఎక్కువ. వేరియంట్‌ను బట్టి ఇది 290 కి.మీ, 400 కి.మీ పరిధిలోని టార్గెట్లను ఛేదించగలవు. నింగి, నేల, నీరు నుంచి వీటిని ప్రయోగించ సామర్థ్యం ఉంది. ఫైర్ అండ్ ఫర్గట్ సామర్థ్యా్న్ని కలిగి ఉంటుంది. రాడార్‌కు దొరకకుండా దాడులు చేయగలదు. ఈ ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో సత్తా చాటింది. పాకిస్తాన్‌లోని ఆ దేశ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.