High Court Questioned Central Government: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని నియంత్రించేందుకు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21న జరగనుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా వీడియోలు సృష్టించి అప్‌లోడ్ చేస్తున్నారని, వాటి ద్వారా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేస్తున్నారని కోర్టు…
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు డీప్‌ఫేక్‌ల సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఉన్న ఐటీ నిబంధనలను అనుసరించాలని ఆదేశిస్తూ ఒక అడ్వయిజరీ జారీ చేసింది.
Deepfake: డీప్‌ఫేక్‌పై కేంద్ర సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఆన్‌లైన్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో డీప్‌ఫేక్ ముప్పును పరిశీలించడానికి, అటువంటి కంటెంట్‌ని గుర్తించడానికి, బాధిత పౌరులకు సాయం చేయడానికి కేంద్రం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రకి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
Deepfakes: ఇటీవల కాలంలో పలువురు సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదం అయింది. అసభ్యకరంగా ఉన్న ఈ వీడియోలపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ డీప్‌ఫేక్ అనేది ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటిని, ఇది సమాజంలో గందరగోళానికి కారణమవుతోందని శుక్రవారం అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యలయంలో బీజేపీ దీపావళి మిలన్ కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు…