Deepfake: డీప్‌ఫేక్‌పై కేంద్ర సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఆన్‌లైన్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో డీప్‌ఫేక్ ముప్పును పరిశీలించడానికి, అటువంటి కంటెంట్‌ని గుర్తించడానికి, బాధిత పౌరులకు సాయం చేయడానికి కేంద్రం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రకి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.
ఇటీవల కాలంలో డీప్‌ఫేక్ మార్ఫడ్ వీడియోలు వివాదం కావడంతో కేంద్రం దీనిపై చర్యలు తీసుకుంటుంది. రష్మికా మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ వంటి బాలీవుడ్ నటుల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడం సమస్య తీవ్రతను పెంచింది. దేశంలోని చాలా మంది ప్రముఖులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also: Russia-Ukraine War: రష్యాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్.. 16 డ్రోన్లు కూల్చివేత
ఈ విషయంపై చర్యల కోసం త్వరలోనే ఓ వెబ్సైట్ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. డీప్‌ఫేక్ సంబంధించి ఐటీ నిబంధనలను ఉల్లంఘించే సోషల్ మీడియా సంస్థలపై ఫిర్యాదులు చేసేందుకు ఈ వెబ్సైట్ ఉపయోగపడనుందని తెలిపారు. డీప్ ఫేక్‌ల విషయంలో బాధ్యలపై ఎఫ్ఐార్ నమోదు చేసేలా పౌరులకు ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కంటెంట్ వివరాలను అధికారులు ఇస్తే, బాధ్యులపై కేసు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీప్ ఫేక్‌లను అరికట్టేందుకు సామాజిక మధ్యమాలు తమ ‘టర్మ్ ఆఫ్ యూజ్’ను ఐటీ నిబంధలనకు అనుగుణంగా మార్చాలని కేంద్రమంత్రి ఆదేశించారు. దీని కోసం వారం రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.